ఈ ఏడాది నవంబరులో ఫ్రెషర్ల నియామకాలు భారీగా పుంజుకున్నాయి. హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ వంటి సేవల రంగాల కారణంగా గత నెలలో ఫ్రెషర్ల నియామకాలు 30 శాతం పెరిగాయని నౌక్రీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. 16ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల నియామకాల్లోనూ 27శాతం వృద్ధి కనిపించిందని పేర్కొంది.