W.G: తాగునీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని లించోపింగ్ యూనివర్సిటీ (స్వీడన్) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గా శంకర్ వావిలపల్లి సూచించారు. గురువారం తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో నీటి శుద్ధికరణకు స్థిరమైన సాంకేతికత, భవిష్యత్తు కోసం అధునాతన పదార్థాల వినియోగం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.