SRPT: హుజూర్ నగర్లోని వాగ్దేవి హై స్కూల్లో స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర మంత్రులు, కలెక్టర్, DEO, MEO, ప్రిన్సిపాల్ పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణ చదువులతో పాటు నిజ జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలని పాఠశాల కరెస్పాండెంట్ జాల. జ్యోతిబాబు, ప్రిన్సిపాల్ నిడిగొండ గంగాధర్ సూచించారు.