NGKL: జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం ఆవరణలో ఎంపీ డాక్టర్ మల్లు రవి నిధులతో ఏర్పాటు చేసిన ఐమాస్ట్ లైట్లను ఆలయ కమిటీ అధ్యక్షుడు వాస ఈశ్వరయ్య మరియు ఉత్సవ కమిటీ సభ్యులు గురువారం ప్రారంభించారు. ఎంపీ సూచించిన వెంటనే లైట్ల కోసం నిధులు మంజూరు చేసినందుకు ఎంపీకి కృతజ్ఞతలు తెలియజేశారు.