MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంను గురువారం MLA గడ్డం వినోద్ దర్శించుకున్నారు. MLAకి ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు.