ADB: నార్నూర్ మండలంలో ఈనెల 11వ తేదీన పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం కొత్తపల్లి (H) గ్రామ సమీపంలో అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. రూ. 50 వేలకు మించి నగదు తరలించవద్దని హెచ్చరించారు. సరైన ధ్రువపత్రాలు లేకుంటే నగదును సీజ్ చేస్తామన్నారు. రానున్న ఎన్నిక రోజు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో రానుంది.