కోనసీమ: అమలాపురంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఎమ్మెల్యే ఆనందరావు క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం 10గంటలకు నియోజకవర్గ స్థాయిలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సిబ్బంది తెలిపారు. సమస్యల పై అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.