ELR: నూజివీడు మ్యాంగో టౌన్ ఆధ్వర్యంలో కృత్రిమ కాలు అమర్చేందుకు స్క్రీనింగ్ క్యాంప్‌ను రోటరీ ఆడిటోరియంలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు టౌన్ అధ్యక్షులు శశికాంత్ నిన్న తెలిపారు. ప్రమాదవశాత్తూ, అనారోగ్యంతో కాలు కోల్పోయిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నూతన జీవితాన్ని ప్రారంభించాలని కోరారు.