HNK: తెలంగాణ అర్చక ఉద్యోగ JAC ఛైర్మెన్ గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో నిన్న అర్చక, ఉద్యోగ సంఘాల నేతలు TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారికి అర్చక ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దీనిపై మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించినట్లు అర్చకులు తెలిపారు.