E.G: గోకవరం సబ్స్టేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో మల్లవరం 11/K.V ఫీడర్ పరిధిలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ జె.పి.బి నటరాజ్ బుధవారం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గోకవరం మండలంలోని కొత్తపల్లి, సూదికొండ, కామరాజుపేట, గంగంపాలెం, ఉమ్మెత్త గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు.