BDK: సైబర్ నేరాల నివారణపై అవగాహన పెంచేందుకు జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 42 రోజుల పాటు ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ అశోక్, అధికారులతో కలిసి వారు సైబర్ నేరాల నివారణ పోస్టర్లను ఆవిష్కరించారు.