ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీఎస్పీఎస్సీ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రమేయం ఉన్న వారిని డిబార్ చేయాలని నిర్ణయించింది. సిట్ (Sit) అరెస్టు చేసిన 37 మంది ఇకపై టీఎస్పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా డిబార్ చేయాలని కమిషన్ ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం 44 మందిపై కేసు నమోదు చేయగా 43 మందిని అరెస్ట్ చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (Paper leakage) కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తూనేవున్నాయి. ఊహించని రీతిలో నిందితులు బయటపడుతున్నారు. టీఎస్పీఎస్సీ లావాదేవీల లెక్క లక్షలు దాటి కోటికి చేరుకుంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు వ్యాపం స్కాంలా(Vyapam scam) మారుతోంది. ప్రవీణ్ నుండి మొదలైన పేపర్ లీక్ కేసులో లావాదేవీలు 1 కోటి దాటాయి. డబ్బు ఆశతో ఒకరి నుండి మరొకరు పేపర్ ను అమ్ముకున్నారు. తాజాగా హైటేక్ కాపింగ్ (Hi-tech coping) వ్యవహారం బట్టబయలు అయింది. విద్యుత్ శాఖ డీఈ సురేష్ (DE Suresh) ఆధ్వర్యంలో భారీ హై టేక్ ముఠా ఏర్పాటు చేశారు. వరంగల్ లోని ఒక పరీక్ష కేంద్రంలో అభ్యర్థులు హై టెక్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. సిట్ దర్యాప్తులో బండారం బయటపడింది. డీఏవో పేపర్ (DAO paper) ను విద్యుత్ శాఖ డీఈ రమేష్ 15 మంది అభ్యర్థులకు అమ్ముకున్నారు. తన వద్ద ఏఈఈ పేపర్ (AEE paper) లేకపోయినప్పటికీ హైటెక్ కాపీoగ్ చేయిస్తా అని రూ.20 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. పరీక్ష హాల్ లో ఇన్విజిలేటర్ తో డీల్ కుదుర్చుకున్నారు. పరీక్ష హాల్ కు వెళ్ళే ముందే మైక్రో ఫోన్ (Micro phone) లు, ఇయర్ బడ్స్ ఏర్పాటు చేశారు. సోమవారం ఇన్విజిలేటర్ ను సిట్ అదుపులోకి తీసుకుంది. ఇంకా ఆరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది.