BDK: వైభవంగా రామయ్య కళ్యాణం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీ సీతారాముల నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మార్గశిర మాసం శుక్ల పక్షం త్రయోదశి సందర్బంగా ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.