E.G: రాజమండ్రి రూరల్ మండలం వెంకటనగరంకి చెందిన వైసీపీ నాయకుడు మోత రమేష్ కారును మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించడంతో ధ్వంసం అయ్యింది. ఈ క్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన తనయుడు చెల్లుబోయిన నరేన్ బుధవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు.