TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల జోరు నడుస్తోంది. ఇవాళ మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 182 మండలాల్లో 4,159 సర్పంచ్, 36,452 వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఎల్లుండి వరకు నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 6న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండనుంది. డిసెంబర్ 17న పోలింగ్ జరగనుంది.
Tags :