PLD: వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మంగళవారం రోడ్డు పక్కన గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని గుర్తించిన వారు వెంటనే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని పోలీసులు కోరారు.