BPT: పర్చూరు మండలం అడుసుమల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు సరఫరా నిలిపివేస్తామని ఆ శాఖ ఏడీ శ్రీనివాసులు తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని గొల్లపూడి, తిక్కరాజుపాలెం, బోడవాడ, ఇనగల్లు, అడుసుమల్లి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.