GNTR: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై మంగళవారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. మాదక ద్రవ్యాల వినియోగానికి ఆకర్షితులవుతున్న వారిని ప్రాథమిక దశలోనే గుర్తించాలన్నారు. విద్యాసంస్థలు, వసతి గృహాల్లో అధికారుల నిరంతర పర్యవేక్షణ అవసరమన్నారు.