WNP: ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకొని జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధితులకు చికిత్స, సేవలు అందిస్తున్న సిబ్బందికి మంగళవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో ప్రశంసా పత్రాలను అందజేశారు.