PPM: కొమరాడమండలంలోని కళ్లికోట గ్రామానికి చెందిన బొద్దిన నారాయణ, జాగన రామకృష్ణ సాగుచేసిన టమాటా పంటను ఏనుగులు ఇవాళ ధ్వంసం చేశాయి. పంట పొలంలో సంచరించడంతో మొత్తం పాడైందని, అటవీశాఖ అధికారులు స్పందించి పరిహారం అందజేయాలని రైతులు విజ్ఞప్తిచేశారు. ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు.