VZM: వేపాడ మండలంలోని గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల జీఎస్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీవోగా శైలజ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈమె కొత్తవలస మేజర్ పంచాయతీలో ఈవోగా పనిచేస్తూ పదోన్నతి పై ఇక్కడికి వచ్చారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె అన్నారు.