KKD: ఈ నెల 4 నుంచి కర్నూలులో జరిగే 11వ అంతర్ జిల్లాల సీనియర్ పురుషుల హ్యాండ్బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికలు బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా హ్యాండ్ బాల్ సంఘ అధ్యక్షుడు ఎం. దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ రూరల్ పనసపాడులోని దిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉదయం 10 గంటలకు జరిగే పోటీల్లో ఎంపికలు జరుగుతాయన్నారు.