VZM: రామభద్రపురం పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం CITU ఆద్వర్యంలో చెత్తను ప్రోగుచేసి దానికి పూజలు చేసి వినూత్న నిరసన తెలిపారు.ఈ సందర్భంగా CITU మండల కార్యదర్శి బలస శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నిత్యం ప్రజారోగ్యం కోసం శ్రమిస్తున్న కార్మికులుకు 4 నెలలుగా జీతాలు అందలేదని, జీతాలు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.