SRPT: 2025-27 సంవత్సరానికి లాటరీ ద్వారా మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు నేటి నుంచి విక్రయాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా HNRలో ఆరు షాపులు తెరుచుకున్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో షాపులు దక్కించుకున్న వారికి ప్రారంభంలోనే లాభాల కిక్కు కలిసిరానుంది. అన్ని రకాల లిక్కర్ బ్రాండ్స్‌ను అందుబాటులోకి తేవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.