RR: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ప్రారంభించిన సీసీ రోడ్ల పనులను కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాయిరాం కాలనీలో రూ. 17.50 లక్షలు, ఆఫీసర్స్ కాలనీలో రూ. 34 లక్షలు, శ్రీపురం కాలనీలో రూ. 18 లక్షలు, NGO’S కాలనీలో రూ. 21 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టామని తెలిపారు.