TG: కమీషన్ల కోసమే కొత్త థర్మల్ ప్లాంట్లు కట్టాలని ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్టీపీసీ ఇచ్చే కరెంట్ వల్ల కమీషన్లు రావనే ఇలా చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలపై.. రూ. 84వేల కోట్ల భారం పడుతుందన్నారు. విద్యుత్ రంగంలో కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందన్నారు.