AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నెలబెట్టుకుంటున్నామని అన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే, కొల్లేరు సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని సీఎం వెల్లడించారు.