VSP: విశాఖ స్టీల్ ప్లాంట్ తాత్కాలిక సీఎండీ, కేంద్ర ప్రభుత్వం కమీషన్ల కోసం నాసిరకం కోక్ కొనుగోలు చేస్తూ, ప్లాంట్ను కావాలనే నష్టాల్లోకి నెడుతున్నారని సీఐటీయూ నేతలు సీ.హెచ్. నరసింగరావు, ఎం.జగ్గునాయుడు ఆరోపించారు. సోమవారం విశాఖలో వారు మీడియాతో మాట్లాడారు. నాసిరకం కోక్ వాడటం వల్ల నాణ్యతలేని స్టీల్ ఉత్పత్తి అవుతోందని ఆరోపించారు.