ములుగు జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తున్నా ములుగు మున్సిపాలిటీలో మాత్రం నిశ్శబ్దం నెలకొంది. గ్రామాల్లో అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు, ప్రచారంతో నాయకులు బిజీగా ఉంటే, ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి నాయకులు “ఎప్పుడు మన వంతు?” అని ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ల అనిశ్చితితో మున్సిపల్ ఎన్నికలకు ఇంకా సమయం పట్టనుంది.