TG: హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి వనపర్తి జిల్లా ఆత్మకూరుకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. సీఎంతోపాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు. మక్తల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నట్లు సమాచారం.