GDWL: గట్టు మండలం సల్కాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు చేసిన ప్రకటన జిల్లాలో చర్చనీయాంశమైంది. గ్రామ అభివృద్ధి కోసం ఏకంగా 22 అంశాలతో కూడిన మేనిఫెస్టోను ఆయన వంద రూపాయల బాండ్ పత్రంపై విడుదల చేశారు. తాను ఎన్నికైతే ఈ హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పడం వైరల్ అయ్యింది.