CTR: పుంగనూరు మండలం ప్రసన్నయ్య గారి పల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి నిర్వహించారు. సోమవారం గ్రామంలో అర్హత కలిగిన లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.