గర్భిణితో ఉన్న ఓ మహిళను సూర్యాపేట జిల్లా కోదాడ(kodad) ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆ క్రమంలో ఆమెకు మంగళవారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉన్న నర్సులు వైద్యురాలికి విషయం తెలిపారు. కానీ అందుకు ఆమె రాలేనని తెలిపింది. మరోవైపు ఆస్పత్రిలో నొప్పులతో ఇబ్బంది పడుతున్న మహిళకు నర్సులే(nurses) కాన్పు పూర్తి చేశారు. కానీ ఆ కాన్పు వికటించడంతో నవజాతశిశువు మృతి చెందింది.
ఈ నేపథ్యంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు(family) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యురాలు లేని క్రమంలో ప్రైవేటు ఆస్పత్రికి వెళాతామని అంబులెన్స్ డ్రైవర్ ను కోరినా కూడా రాలేదని వాపోయారు. దీంతో ఆస్పత్రిలో వైద్యురాలు లేకపోవడం వల్లే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని విలపించారు.