మలయాళ స్టార్ మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబోలో తెరకెక్కిన ఫ్రాంఛైజీ ‘దృశ్యం’. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రెండు పార్టులు రిలీజ్ కాగా.. త్వరలోనే మూడో పార్ట్ రాబోతుంది. తాజాగా ‘దృశ్యం 3’ మూవీ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ పనోరమా స్టూడియోస్ దీని హక్కులను రూ.160 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.