MNCL: బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ విమర్శించారు. మంగళవారం లక్షెట్టిపేట పట్టణంలో నాలుగు మండలాల బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మద్దతు దారులను గెలిపించేలా పార్టీ నాయకులు కృషి చేయాలన్నారు.