సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఇవాళ పుట్టపర్తికి రానున్నారు. ఈ ఇద్దరు ప్రముఖులు ముందుగా సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అనంతరం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అంతర్జాతీయ యువజన సదస్సులో పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.