PDPL: రామగుండం ఎమెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ పరిధి 36వ డివిజన్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి పాల్గొని కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. కాల్వ లింగ స్వామి, గుంపుల తిరుపతి, షాపింగ్ కాంప్లెక్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.