ఓ ప్రయాణ నిమిత్తం తెల్లవారు జామున ఆటోలో వెళుతున్న ప్రయాణికులకు ఆకస్మాత్తుగా ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు ఓ బోలెరో వాహనం వచ్చి ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లా(Gadwal district)లోని రాయచూర్ హైవేపై చోటుచేసుకుంది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే మృతి చెందిన వారు గద్వాల ప్రాంతానికి చెందిన జములమ్మ, అర్జున్, వైశాలీగా పోలీసులు పేర్కొన్నారు. వారంతా ఒకే ఫ్యామిలీకి(same family) చెందిన వ్యక్తులని వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ప్రమాదంలో ఎవరిది తప్పు..అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందా లేదా డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్నాడా అనే కోణాల్లో పోలీసులు వివారాలను ఆరా తీస్తున్నారు.