కోనసీమ: ఉద్యోగాల పేరుతో రూ.9 లక్షలు మోసపోయిన ఘటన పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖకు చెందిన కింతన కళ్యాణ్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని తన స్నేహితుల ముగ్గురు నుంచి రూ.9 లక్షలు తీసుకుని మోసం చేశాడని గ్రామానికి చెందిన పెయ్యిల నరేష్ కుమార్ ఫిర్యాదు చేసినట్లు పి.గన్నవరం ఎస్సై శివకృష్ణ తెలిపారు.