ఉమ్మడి WGL జిల్లాలో DEO బాధ్యతల విషయంలో గందరగోళం నెలకొంది. JNG, MLG జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లకు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించగా, BPHL, MHBD, WGL జిల్లాల్లో అసిస్టెంట్ డైరెక్టర్లు డీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు విద్యా పరిపాలన అప్పగించడం సరికాదని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.