వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. ఆమె మొదట తెలంగాణలో పార్టీ ప్రకటించినప్పుడు.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ…ఇప్పుడు ఆమె రాజకీయంగా హైలెట్ అయ్యారు. నిన్న ఆమె అరెస్టు వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు ఎవరూ పట్టించుకోని వారు కూడా… ఇప్పుడు షర్మిలపై సెటైర్లు వేస్తుండటం గమనార్హం.
కాగా.. తాజాగా కవిత కూడా… షర్మిల పై సెటైర్లు వేశారు. షర్మిల తానా అంటే బీజేపీ నేతలు తందానా అంటున్నారని ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా ఎద్దేవా చేశారు. ‘తాము వదిలిన బాణం తానా అంటే.. తందానా అంటున్న తామరపువ్వులు’.. అంటూ ట్వీట్ చేశారు. తన ట్విట్టర్ ద్వారా వైఎస్సార్ తెలంగాణా పార్టీ, బీజేపీ రెండూ ఒకటేనని అర్థం వచ్చేలా కవిత పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింగ హాట్ టాపిక్ గా మారింది. ఒక మహిళ నాయకురాలిపై దాడి జరిగితే.. ఇలాగానే స్పందించేది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. షర్మిల అరెస్ట్ పై గవర్నర్ తమిళసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ట్వీట్ చేశారు. ఒక మహిళ పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అసహ్యకరమైనదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో, వైఎస్సార్టీపీ, బీజేపీని ఉద్దేశిస్తూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ప్రస్తుతం కవిత ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.