AP: దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడి తెలుగు ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు ఇంటింటికీ ఐటీ ఉండేదని, కానీ ఇప్పుడు ఏఐ వచ్చిందని పేర్కొన్నారు. త్వరలోనే అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు రాబోతున్నాయని తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుతం రాష్ట్రంలో 750 సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.