AP: అబుదాబి ఛాంబర్ ఛైర్మన్ అలీ జాబీతోపాటు G-42 సీఈవో మున్సూర్ అల్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పనిచేస్తోందని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో అందుబాటులోకి క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు రాబోతున్నాయని చెప్పారు. కొత్త అవకాశాలు, ఇన్నోవేషన్ కేంద్రంగా అమరావతి నిలుస్తుందని పేర్కొన్నారు.