W.G: టి. నరసాపురంలో క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని ఇవాళ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో జీలుగుమిల్లి ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వరరావు, టి. నరసాపురం ఎస్సై జయ బాబు, తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. లైసెన్స్ పొందిన దుకాణ యజమానులకు అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.