MDK: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఇందిరా మహిళ నిర్మాణం చేపట్టాలన్నారు.