ELR: పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇవాళ కైకలూరులో డాగ్ స్క్వాడ్ భద్రతా తనిఖీలు నిర్వహించారు. జిల్లా డాగ్ స్క్వాడ్ సిబ్బంది, కైకలూరు టౌన్ ఎస్సై శ్రీనివాసరావు స్థానిక బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, పరిసర దేవాలయాలు, లాడ్జిలు, సినిమా థియేటర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. నేరాలను ముందస్తుగానే అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టినట్లు వివరించారు.