SRD: మండల కేంద్రమైన కంగ్టితో పాటు పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులతో ఓ మోస్తారు వర్షం కురిసింది. గత వారం రోజుల నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఇవాళ ఉదయం నుంచి ఆకాశం నల్లటి మబ్బులతో కమ్మేసింది. ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. ఇదివరకు కురిసిన భారీ వర్షంతో పంటలు కొంత దెబ్బతినగా, ఇప్పుడు మళ్లీ వర్షంతో కాస్త పంట కూడా చేతికందకుండా పోతుందని రైతులు వాపోయారు.