NLG: ఆంజనేయ శ్రీ శ్రీ శ్రీ కేతావత్ జయరాం గురుస్వామి ఆదేశాల మేరకు దేవరకొండలోని తులసమ్మకుంట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో హనుమాన్ శక్తి జాగరణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ దీక్ష వాల్ పోస్టర్స్ విడుదల చేశారు. కార్యక్రమంలో హనుమాన్ శక్తి జాగరణ సమితి, దేవాలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు బుషరాజు గిరి, గెలవయ్య, పాల్గొన్నారు.