Manipur violence:మణిపూర్‌లో హింస (Manipur violence) చల్లారడం లేదు. గిరిజన, గిరిజనేతరుల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మక పరిస్థితులకు దారితీసింది. పోలీసులు (police), ఆర్మీ బలగాలను మొహరించారు. అయినప్పటికీ ఆందోళనకారులు రెచ్చిపోయారు. దీంతో కనిపిస్తే కాల్చివేతకు సంబంధించిన ప్రతిపాదన హోం శాఖ పంపించగా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు మణిపూర్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో మైతైలకు గిరిజన రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేయడం.. గిరిజనులు వ్యతిరేకించడంతో ఘర్షణ చెలరేగింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో హోం శాఖ షూట్ అండ్ సైట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను కోరింది. గవర్నర్ అనుమతితో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 3వ తేదీ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిన సంగతి తెలిసిందే. షూట్ అండ్ సైట్ ఆర్డర్ కోసం రాష్ట్రంలో గల అన్ని జిల్లా మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీచేశారు.
ఇదీ నేపథ్యం
షెడ్యూల్ తెగ స్టేటస్ కోసం గిరిజనేతర మైతే వర్గం డిమాండ్ చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ తర్బుంగాలో గిరిజన సంఘీభావ యాత్రకు పిలుపునిచ్చింది. ర్యాలీలో వేల మంది పాల్గొన్నారు. ఎస్టీ హోదా కోసం మైతే చేసిన డిమాండ్‌కు మణిపూర్ (manipur) వ్యాలీ ప్రాంతానికి చెందిన ప్రతినిధులు నుంచి మద్దతు ఉంది. దీంతో గిరిజన (tribals) ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలా గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణకు దారితీసింది. మణిపూర్ జనాభాలో 53 శాతం మైతే వర్గానికి చెందినవారు ఉంటారు. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానిక గిరిజనులు అంటున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ ఇస్తే తమ పరిస్థితి ఏంటీ అని అడుగుతున్నారు. నిజానికి పర్వత ప్రాంతాల్లో నివసించేందుకు మైతే వర్గానికి అనుమతి లేదు.