ప్రకాశం: పామూరు పట్టణంలో ఆదివారం రాత్రి పోలీసులు డ్రోన్ సహాయంతో గస్తీ నిర్వహించారు. నిర్మానుష్య ప్రాంతాలు, పట్టణ పరిసరాలను పరిశీలించి, అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలపై దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, పేకాట ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.